గాంధీ వేషధారణలో 750 మంది చిన్నారులు 

750 Children Dressed As Gandhi In Yadadri Bhuvanagiri - Sakshi

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ ప్రతిష్టాన్‌ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషధారణలో అలరించారు. చేనేత మగ్గం, రాట్నం, రాట్నంపై నూలు వడికే విధానాన్ని ప్రదర్శించారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటిచెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top