
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధం లేదు
స్పష్టం చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని సర్వేనంబర్ 25లోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, దీంతో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 2004లో జనవరి 13న 400 ఎకరాల భూమిని కేటాయించిందని వివరించింది. అయితే ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోవడంతో 2006 నవంబర్ 21న అప్పటి ప్రభుత్వం ఈ భూమిని వెనక్కి తీసుకుందని పేర్కొంది.
దీన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపింది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపింది. ఆ తరువాత ఐఎంజీ భారత్ సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. అక్కడా కొట్టేయడంతో ప్రభుత్వ అధీనంలోకి వచ్చిందని వివరించింది. ఆ తరువాత అక్కడ ఐటీ, ఐటీయేతర పరిశ్రమల కోసం కేటాయించాలని టీజీఐఐసీ విజ్ఞప్తి మేరకు.. ఆ సంస్థకు భూమి కేటాయించినట్లు తెలిపింది. ఈ 400 ఎకరాల పరిధిలోకి బఫెల్లో లేక్, పీకాక్ లేక్ రావని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment