వాట్సాప్‌లో విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు | 18 Lakh Govt School Students Receive Report Cards via WhatsApp: Telangana | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు

Apr 25 2026 4:50 AM | Updated on Apr 25 2026 4:50 AM

18 Lakh Govt School Students Receive Report Cards via WhatsApp: Telangana

మీ సేవ ద్వారా 18 లక్షల మందికి పైగా విద్యార్థులకు పంపిణీ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్‌ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షిక ప్రోగ్రెస్‌ కార్డులు వాట్సాప్‌ ద్వారా తల్లిదండ్రులకు చేరాయి. ఐటీ శాఖ పరిధిలోని మీ సేవ ద్వారా 18 లక్షల మందికి పైగా విద్యార్ధుల తల్లిదండ్రులకు ప్రోగ్రెస్‌ కార్డులు జారీ అయ్యాయి.

దీనిద్వారా విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లకుండానే వేగంగా, సురక్షితంగా, పేపర్‌లెస్‌ విధానంలో తల్లిదండ్రులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్డుల్లో మార్కులతో పాటు, హాజరుశాతం వివరాలు కూడా ఉన్నాయి. ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులకు సాంకేతిక సేవలు చేరాలనే లక్ష్యంతో వాట్సాప్‌ ద్వారా రిపోర్ట్‌ కార్డులు అందించినట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీని ద్వారా ఆయా కుటుంబాలకు సమ యం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement