రాష్ట్రంలో 5,040 ఎంబీబీఎస్‌ సీట్లు

150 MBBS Seats Increased In Telangana, Total 5040 - Sakshi

ఈ ఏడాది అదనంగా 150 సీట్లు

రాష్ట్రస్థాయి ర్యాంకులపై కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయి. తాజాగా ఓ ప్రైవేట్‌ కాలేజీకి అనుమతి రావడంతో అదనంగా 150 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. రాష్ట్రంలో 2020–21 సంవత్సరానికి మెదక్‌ జిల్లా పటాన్‌చెరులో టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీకి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తాజాగా అనుమతించింది. మరో 150 సీట్లు ఈ ఏడాది నుంచి అదనంగా అం దుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 5,040కు చేరుకున్నాయి. ఈఎస్‌ఐసీసహా మొత్తం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. 18 ప్రైవేట్‌ కాలేజీల్లో 2,750, 4 మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో 550  సీట్లు ఉన్నట్లు కాళోజీ వర్సిటీ తెలిపింది. చదవండి: అఖిల భారత కోటా 6,410

చివరి వారంలో నోటిఫికేషన్‌ 
అఖిల భారత కోటా అడ్మిషన్ల నోటిఫికేషన్‌ ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశాలున్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి.  ఈ నెల 16న నీట్‌ ఫలితాలు వచి్చనా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రాష్ట్రానికి ర్యాంకుల సమాచారం పంపలేదు. రాష్ట్రస్థాయి ర్యాంకుల జాబితా, దరఖాస్తుల స్వీకరణ నోటిíÙకేషన్‌ ఒకేసారి విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు తెలి పాయి.  ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు మినహాయించి రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం (230) సీట్లను ఆలిండియా కోటాకు ఇస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top