తిరుత్తణి: తిరువలంగాడు గ్రామ పంచాయతీలో సేకరిస్తున్న చెత్తకుప్పలను పంచాయతీ పారిశుద్ద్య కార్మికులు సేకరించి ట్రాక్టర్ ద్వారా అక్కడున్న పాఠశాల, ఆరోగ్యకేంద్రం, అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో నిల్వ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో దుర్వాసన చోటుచేసుకోవడంతో చెత్తకుప్పలు వేసేందుకు ఆ ప్రాంతం వాసులు వ్యతిరేక త వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం చెత్తకుప్పల ట్రాక్టర్ తీసుకెళ్లిన పారిశుధ్య కార్మికులతో ఆ ప్రాంతం వాసులు చెత్త కుప్పలు వేసేందుకు వ్యతిరేకత వ్యక్తం చేసి ట్రాక్టర్ తీసుకెళ్లి బీడీఓ కార్యాలయం ముందు పోశారు. దీంతో కలకలం చోటుచేసుకోవడంతో బీడీఓ అరుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పంచాయతీ సిబ్బంది చెత్తకుప్పలను తొలగించి ప్రభుత్వ కార్యాలయం ముందు చెత్తకుప్పలు పోసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


