తిరుత్తణి: కొండ ప్రాంతంలోని గ్రామంలో చోరబడ్డ భారీ కొండ చిలువను అగ్నిమాపక శాఖ సిబ్బంది పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. తిరుత్తణి మండలంలోని చిరుగుమి పంచాయతీలో అరుంధతీ కాలనీలో దాదాపు 40 కుటుంబీకులు నివాశముంటున్నారు. అటవీ ప్రాంతంకు సమీపంలోని గ్రామంలో గురువారం ఉదయం భారీ కొండ చిలువ చోరబడడంతో గ్రామీణులు ఆందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక శాఖ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. తిరుత్తణి అగ్నిమాపక శాఖ అధికారి సంపత్ తన సిబ్బందితో అరుంధతీ కాలనీకి చేరుకుని దాదాపు గంటపాటు శ్రమించి ఎనిమిది అడుగుల వెడల్పు కొండ చిలువను పట్టుకోవడంతో గ్రామీణులు ఊపిరిపీల్చుకున్నారు.
అన్నానగర్: కోయంబత్తూరు జిల్లా, సూలూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. గత మే 21వ తేదీన, ఆ బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు సూలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్వహించిన గాలింపు చర్యల్లో, సున్నంపాలయం చెరువు సమీపంలోని కొబ్బరి తోటలో బాలిక మృతదేహం లభ్యమైంది. పోస్టు మార్టంలో ఆ బాలికపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు తెలిసింది. ఈ హత్య ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని ఏర్పరచింది. పోలీసుల విచారణలో, పక్కింటి నిర్మాణ కార్మికుడైన కార్తి (33), అతని స్నేహితుడు మోహన్ (31) బాలిక హత్యలో పాలుపంచుకున్నారని తేలింది. పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. దుకాణంలో చాక్లెట్లు కొనిస్తానని చెప్పి కార్తి మోటార్ సైకిల్‌పై బాలికను కిడ్నాప్ చేసి, ఆమె పై అత్యాచారం చేసి హత్య చేశాడని, ఈ ఘటనలో అతని స్నేహితుడు మోహన్ సహ నిందితుడిగా ఉన్నాడని వెల్లడైంది. దీని తర్వాత, ఈ కేసును కోయంబత్తూరు పోక్సో స్పెషల్ కోర్టు ఈ కేసును విచారిస్తోంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, ఈ కేసులో తీర్పును జడ్జి 27వ తేదీ ప్రటిస్తామమన్నారు. కాగా ఈ కేసులో శుక్రవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోయంబత్తూరు కోర్టు ప్రాంగణంలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేయనున్నారు.
తిరుత్తణి: వర్షపు నీరు పొదుపు పట్ల పట్టణ ప్రజలకు పాఠశాల విద్యార్ధులు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. తిరుత్తణి మున్సిపాలిటీ ద్వారా భూగర్భజలాలు కాపాడుకోవడం, వర్షపు నీటిని పొదుపు చేయడం ఆవశ్యకత పట్ల అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ బాలుర మహాన్నత పాఠశాల విద్యార్ధులు 150 మంది పాల్గొన్న ర్యాలీని మున్సిపల్ కమిషనర్ కన్నియప్పన్ ప్రారంభించారు. పాఠశాల ఆవరణ నుంచి గాంధీ రోడ్డు, చైన్నె బైపాస్ రోడ్డు, నగరి రోడ్డు సహా ప్రధాన మార్గాల్లో విద్యార్ధులు ర్యాలీగా వెళ్లి వర్షా కాలంలో వర్షపు నీరు వృదా కాకుండా ప్రతి ఇళ్లు, కార్యాలయాలు, కంపెనీలు, ఫ్యాక్టరీల వద్ద ఇంకుడు గుంతలు, వర్షపు నీరు నిల్వ తొట్టెలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే భూగర్భజలాల నీటి మట్టం పెరిగి వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడదని విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు.


