క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Nov 27 2026 2:14 AM | Updated on Nov 27 2026 2:14 AM

యాంటీబయోటిక్స్‌ వినియోగంపై అవగాహన యువకుడి హత్య కేసులో... ● ముగ్గురు సోదరులకు జీవిత ఖైదు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంకు ఉపకరణాల వితరణ ఉత్తర చైన్నె థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పొగతో.. ● పంటపొలాలకు నష్టం బహుజన సమాజ్‌ వాదీ పార్టీ సదస్సు

సాక్షి, చైన్నె: ప్రపంచ యాంటీమైక్రోబియల్‌ అవగాహన వారం 2026 సందర్భంగా, కాటన్‌కుళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. యాంటీబయోటిక్స్‌ను సరైన పద్ధతిలో వాడటం, వాటిని దుర్వినియోగం చేయడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై రోగులు, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ ర్యాలీని ఎస్‌ఆర్‌ఎం మెడికల్‌ కాలేజీ డీన్‌ డాక్టర్‌ ఆర్‌. జయంతి జెండా ఊపి ప్రారంభించారు. సెంటర్‌ ఫర్‌ క్లినికల్‌ ఫార్మకాలజీ ప్రొఫెసర్‌, విభాగాధిపతి డాక్టర్‌ మెల్విన్‌ జార్జ్‌, క్లినికల్‌ ట్రయల్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కుమరవేల్‌ జె. ర్యాలీకి నాయకత్వం వహించారు. ర్యాలీ సాగిన మార్గంలో రోగులు, సందర్శకులు, ప్రజలకు యాంటీబయోటిక్‌ భద్రతపై సరళమైన, ఆచరణాత్మక సందేశాలను అందజేశారు.

అన్నానగర్‌: తిరుచ్చి జిల్లా,కాట్టుపుత్తూరులోని గాంధీ నగర్‌ నివాసి గోకులకృష్ణన్‌ (21). ఇతనికి, అదే ప్రాంతానికి చెందిన అరుల్‌ శరవణన్‌ (29)కి మధ్య పాత కక్షలు ఉన్నాయి. 2018 జనవరి 16న జరిగిన పొంగల్‌ క్రీడా పోటీల సందర్భంగా వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సాయంత్రం, గోకులకృష్ణన్‌ తన సోదరుడు కలైవనన్‌, అతని స్నేహితులతో కలిసి పుంగా నగర్‌ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడికి వచ్చిన అరుల్‌ శరవణన్‌, అతని సోదరులు నవీన్‌ ప్రభు (24), ధనపాల్‌ (19) గోకులకృష్ణన్‌ పై దాడి చేసి కత్తితో పొడిచారు. ఇందులో రక్తపు మడుగులో పడి ఉన్న గోకులకృష్ణన్‌ను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు అతన్ని తీసుకువెళ్లారు, కానీ అతను మార్గమధ్యంలోనే మరణించాడు. పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసి అరుల్‌ శరవణన్‌, నవీన్‌ ప్రభు, ధనపాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. తిరుచ్చి మహిళా కోర్టులో ఈ కేసు జరుగుతు వచ్చింది. గురువారం జరిగిన తుది విచారణ న్యాయమూర్తి షణ్ముగ ప్రియ అరుల్‌ శరవణన్‌, నవీన్‌ ప్రభు, ధనపాల్‌ లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. తదనంతరం, ఆ ముగ్గురినీ తిరుచ్చి సెంట్రల్‌ జైలులో ఉంచారు.

తిరుత్తణి: తిరుత్తణి మండలంలోని బీరకుప్పం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోజూ వందలాది మంది చికిత్స పొందుతున్నారు. రోజూ గర్బిణులకు పరిశోధనతో పాటు ప్రసవం చూస్తున్నారు. ఈ క్రమంలో ముత్తూట్‌ పైనాన్స్‌ సంస్థ ద్వారా ఆరోగ్య కేంద్రంకు రూ.1.60 లక్షల విలువైన వంద చైర్లు, జెనరేటర్‌, ల్యాప్‌టాప్‌, ప్రిడ్జ్‌ తదితర ఉపకరణాలు అందజేసింది.

కొరుక్కుపేట: పొన్నేరి మండల వ్యవసాయ సంఘం సంప్రదింపులు పొన్నేరి తదుపరి ఇవింపేడు ప్రైవేట్‌ మ్యారేజ్‌ హాల్‌ నిర్వాహకులు ములిరత్నం, జానకి నేతృత్వంలో జరిగింది సమావేశంలో, ఉత్తర చైన్నె టైడల్‌ పవర్‌ ప్లాంట్‌ నుండి వెలువడే బూడిద వ్యర్థాల వల్ల వ్యవసాయం దెబ్బతింటోందని, అలాగే థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నుండి వెలువడే బూడిద వ్యర్థాలు వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్నాయని స్థాని కులు ఆరోపించారు. పంటలు నాశనమవడం, దిగుబడులు తగ్గడం వల్ల నష్టపోయిన రైతు లకు ఆ నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా, వ్యవసాయం విద్యుత్‌ తీగలను వెంటనే మరమ్మతులు చేయాలి. పంటలను మేసి నాశనం చేస్తున్న గుర్రాలను, ఆవులను ప్రభుత్వం నియంత్రించి, ప్రజలను రక్షించాలని, సిరువక్కం గౌరచ్చిలో ఒక సహకార బ్యాంకును స్థాపించాలని కోరారు. నిర్వాహకులు జ్యోతి, తిరుమై వినోద్‌ సమన్వయకర్త శేఖర్‌ పాల్గొన్నారు.

తిరువొత్తియూరు: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్ర బహుజన్‌ సమాజ్‌ పార్టీ తరపున ప్రత్యేక సదస్సు పొర్కొడి ఆర్మ్‌స్ట్రాంగ్‌ అధ్యక్షతన జరిగింది. తమిళనాడు రాష్ట్ర బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రధాన కార్యాలయమైన తాయ్‌ రమాబాయి భవన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ప్రధాన కార్యదర్శి పొర్కొడి ఆర్మ్‌స్ట్రాంగ్‌ అధ్యక్షతన వివిధ అంశాలపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు న్యాయవాదులు సందియూర్‌ రాజా పార్థిబన్‌, వి. మార్క్స్‌ రవీంద్రన్‌, ప్రధాన కార్యాలయ కార్యదర్శి రచయిత అ. ముత్తుకృష్ణన్‌, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రచయిత అ. స్మైలీ తబు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement