తిరుత్తణి: లక్షలాది పేద కుటుంబాల ఆకలి తీర్చుతున్న రేషన్ బియ్యం పథకంలో వేలు పెడితే టీవీకే ప్రభుత్వం కథ ముగిసినట్లే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం హెచ్చరించారు. ప్రజావేదిక ప్రచార సదస్సు కార్యక్రమంలో భాగంగా తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలో ఆదివారం సాయంత్రం ముగింపు బహింగ సభ నిర్వహించారు. ఇందులో కామ్రెడ్ పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు పాల్గొన్న సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పె. షణ్ముగం పాల్గొని ప్రసంగించారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది వసంతాలు పూర్తి కావస్తున్నా నేటి పలు గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో కొన్ని కులాలకు నేటికీ స్వేచ్ఛ లేకపోవడం బాధాకరం. కనీస సౌకర్యాలకు నోచుకోని ప్రజలు తమపై నమ్మకం వుంచి అర్జీలు ఇచ్చారు. వాటి పట్ల త్వరలో స్థానిక సమస్యలు పేరిట పోరాలు చేపడుతాం. రాష్ట్రంలోని టీవీకే ప్రభుత్వం మంత్రులు రేషన్ బియ్యంకు సంబందించి మూగజీవులకు మేతగా రేషన్‌బియ్యం వినియోగిస్తున్నారని హేలన చేయడం దుర్మార్గమని, మంత్రులు గ్రామాల్లో పర్యటించి పరిశీలిస్తే అసలు నిజం తెలుస్తుంది. లక్షలాది కుటుంబాల ఆకలి తీర్చుతున్న రేషన్ బియ్యంలో వేలు పట్టేరోజే టీవీకే ప్రభుత్వం కథ ముగుస్తుందని హెచ్చరించారు.


