వీఆర్‌ లివిన్‌ కొత్త ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ లివిన్‌ కొత్త ఆవిష్కరణ

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

సాక్షి, చైన్నె: వీఆర్‌ లివిన్‌ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ ఉత్తర చైన్నెలోని మాధవరం వద్ద విల్లా కమ్యూనిటీని ఆవిష్కరించింది. 6.6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 80కి పైగా లగ్జరీ విల్లాలు తీర్చిదిద్దనున్నారు. ప్రశాంతత, వ్యక్తిగత స్వేచ్ఛ, ఉన్నతమైన జీవనశైలికి ప్రాధాన్యత ఇచ్చే వారి కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ఈ కమ్యూనిటీలో 50కి పైగా ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను టీవీహెచ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ – మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. రవిచంద్రన్‌, ఎస్‌పీఆర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి. హితేష్‌ కవాడ్‌ ప్రారంభించారు. రూ. 2.25 కోట్ల ప్రారంభ ధరతో విల్లాల బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. బుకింగ్‌ చేసుకున్న 12 నుంచి 15 నెలల్లో వీటిని వినియోగదారులకు అందజేయనున్నారు. మాధవరం ప్రధాన ప్రాంతంలో కొలువుదీరిన ఈ ప్రాజెక్టు నుంచి నగరంలోని ప్రముఖ పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్స్‌, బ్యాంకులు, మెట్రో, బస్సు రవాణా వ్యవస్థలు అత్యంత సమీపంలో ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవంలో వీఆర్‌ లివిన్‌ వెంచర్స్‌ వ్యవస్థాపకులు విమల్‌ కుమార్‌ జైన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రూపేష్‌ కుంకులోల్‌ మాట్లాడుతూ ఇక్కడ కేవలం ఒక విల్లా కమ్యూనిటీని నిర్మించడం మాత్రమే కాదు, ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని అందించాలన్నది తమ లక్ష్యంగా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement