ఫ్లైఓవర్‌ నిర్మించాలని కోరుతూ ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్‌ నిర్మించాలని కోరుతూ ధర్నా

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

తిరుత్తణి: చైన్నె తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారికి సమీ పంలోని గ్రామీణుల రాకపోకల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫై ఓవర్లు నిర్మిస్తున్నారు. అదే సమయంలో తిరుత్తణి శివారులోని కాశినాథపురం వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మించాలనే డిమాండ్‌ మేరకు వీసీకే నేతృత్వంలో సోమవారం పోరాటం చేపట్టారు. ఇందులో వీసీకే పుర ట్చి భారతం, దళిత ప్రజాప్రంట్‌, తమిళ బహుజన్‌ సమాజ్‌ పార్టీ, అన్నాడీఎంకే సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్థానికులు సహా 400 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాశినాధపుం వద్ద జాతీయ రహదారి మార్గంలో తిరుత్తణి నాగలాపురం రాష్ట్ర రహదారిలో దాదాపు వంద గ్రా మాలున్నాయి. తమిళనాడు, ఆంధ్రాకు ప్రధాన రోడ్డు మార్గంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలు పయనిస్తుంటాయి. అయితే కాశినాథపురం వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి జాతీయ రహదారుల శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రెండు కిలో మీటర్ల దూ రం వెళ్లి రావాల్సి వుంది. కాశినాథపురం జంక్సన్‌లో ఫ్లై ఓవర్‌ నిర్మించాలని లేని పక్షంలో పోరాటం తీవ్ర చేస్తా మని హెచ్చరించారు. దీంతో ఏఎస్పీ శుభమ్‌ దిమాన్‌ నేతృత్వంలో వంద మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement