కొరుక్కుపేట: ఆత్మవిశ్వాసమే విజయానికి సోపా నం అని ఎస్‌ఆర్‌ఎం కళాశాల అసోసియేట్ ప్రొఫె సర్ డాక్టర్ బాలాజీ అన్నారు.ఈ మేరకు ఎస్‌కేపీడీ బాలుర ప్రాథమిక, మహోన్నత పాఠశాలల 109వ వార్షికోత్స వ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలల కరస్పాండెంట్ ఎస్‌ఎల్ సుదర్శనం అధ్యక్షత వహించగా, ప్రధానోపాధ్యాయురాలు ఓరుంగటి లీలారాణీ,ఈ. రమేష్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ప్రొఫెస ర్ డాక్టర్ బాలాజీ తో పాటు ఆత్మీయ అతిథిగా కర్జన్ కంపెనీ అధినేత బి.గౌతమ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఎస్‌కేపీడీ అండ్ చారిటీస్ యాజమా న్యానికి, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు జ్ఞాపిక,ప్రశంసాపత్రాలు, పదవతరగతి, ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షల్లో స్కూల్ టాపర్‌లుగా నిలిచిన విద్యార్థు లకు రోలింగ్ షీల్డ్‌లను అందించి అభినందించారు.


