4వేల ఏళ్లు జీవించే పాత్ర నేపథ్యంలో.. | - | Sakshi
Sakshi News home page

4వేల ఏళ్లు జీవించే పాత్ర నేపథ్యంలో..

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

తమిళసినిమా: నటుడు జీవి ప్రకాష్‌ కుమార్‌, కయాదు లోహర్‌ జంటగా నటించిన చిత్రం ఇమ్మార్టల్‌. ఏకే ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై అరుణ్‌ కుమార్‌ ధనశేఖరన్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మారియప్పన్‌ చిన్నా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి శ్యామ్‌ సి ఎస్‌ సంగీతాన్ని అందించారు. ఫాంటసీ పిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్‌ 4వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ‘‘ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడు హాలీవుడ్‌ చిత్రంలా అనిపించింది. దీని నిర్మించడం సాధ్యమా అన్న సందేహం కలిగింది. ముఖ్యంగా ఆయన చెప్పిన విజువల్స్‌ క్రియేషన్స్‌కు సిజీ వర్క్‌ చాలా ఎక్కువగా ఉంటుందని అనిపించడంతో దర్శకుడు సుమారు 7 నెలల పాటు విదేశాల్లో స్టూడియోలో పనిచేసే విజువల్‌ మోడల్‌ను తయారుచేసి నాకు చూపించారు. ఇది మీరు ఇంతవరకు చూసిన సాధారణ తమిళ చిత్రాల మాది ఇది ఉండదని, హాలీవుడ్‌ స్థాయిలో రూపొందించవచ్చుననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అని నిర్మాత అరుణ్‌ కుమార్‌ ధనశేఖరన్‌ పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు జీవి ప్రకాష్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ ఇది చాలా విభిన్నమైన కథ చిత్రం. ఇండియన్‌ సినిమాకు కొత్తదైన వ్యాంపర్‌ జోనర్‌లో రూపొందిన చిత్రం. ప్రేక్షకులకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది సుమారు ఏడాది పాటు శ్రమించి సిజి, మాన్‌స్టర్‌ సన్నివేశాలను రూపొందించాం. ఇది ఒక సర్వైవల్‌ థ్రిల్లర్‌ కథాచిత్రంగా ఉంటుంది. 4 వేల ఏళ్ల పాటు జీవించే ఒక పాత్ర చుట్టూ తిరిగే కథా చిత్రం ఇది. నిర్మాత అరుణ్‌ కుమార్‌ ధనశేఖరన్‌ గత రెండేళ్లుగా ఎంతో అంకితభావంతో రూపొందించిన చిత్రం ఇది. ఏ హాలీవుడ్‌ చిత్రానికి కాపీ కాదు. కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు కలిసి ఒక పెద్ద డ్రీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు ‘‘ అని జీవి ప్రకాష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

అవార్డు గ్రహీతలతో సినీ ప్రముఖులు, నిర్వాహకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement