తమిళసినిమా: ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత కలైపులి ఎస్. థాను మనసును హత్తుకునే కథలు ఉంటే నా వద్దకు తీసుకురండి. వాటిని చిత్రాలుగా రూపొందించడానికి నా వల్ల అయిన సాయం చేస్తాను ‘‘ అని పేర్కొన్నారు. ఫిలిం డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆర్‌ఎంకే గ్రాఫ్ ఆఫ్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని ఇటీవల చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్.థాను, దర్శకుడు పేరరసు, నిర్మాత సీవీ.కుమార్, రచయిత లియాకత్ అలిఖాన్ కుదరదు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉత్తమ అవార్డులను గెలుచుకున్న కళాకారులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులలో ఒకరైన కసాలి మాట్లాడుతూ ‘‘ షార్ట్ ఫిలిమ్స్ అవార్డులు 2026 అన్నది మంచి ప్రయత్నంగా పేర్కొన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో సినిమా రంగంలో దర్శకుడుగా ఎలా పరిచయం కావాలి, ఎలా పయనించాలి అన్న పలు సందేహాలు ఉంటాయి అలాంటివారికి చిన్న మార్గదర్శి గానూ, వారు ప్రతిభ చాటుకోవడానికి వేదికగాను ఈ కార్యక్రమం అమరుతుంది ‘‘ అని కసాలి పేర్కొన్నారు. ఇది చాలా సంతోషకరమైన రోజు కసాలి నన్ను ఎప్పుడు కలిసిన సినీ పరిశ్రమ సంక్షేమం కోసం, ప్రతిభావంతులైన కొత్తవారిని ప్రోత్సహించాలి అనే విషయం గురించే మాట్లాడుతారు. అందువల్ల ఆయన ఎలాంటి ప్రయత్వానికై నా నా సహకారం ఉంటుంది. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన యువ కళాకారులు రేపటి సినిమా భావి పౌరులు. మంచి కథలు రాసే ప్రతిభావంతులను ప్రోత్సహించాలి ఆ విధంగా మంచి కథలు రాసుకున్నవారు నన్ను సంప్రదించవచ్చు. వారికి నా చేతన్నంత సాయం చేస్తాను‘‘ అని నిర్మాత కలైపులి ఎస్. థాను పేర్కొన్నారు. కాగా ఈ లఘు చిత్రాల పోటీల్లో గెలుపొందిన ఉత్తమ లఘు చిత్రానికి రూ 25 వేలు నగదు బహుమతి, ఉత్తమ దర్శకుడికి రూ. 15 వేలు, ఉత్తమ నటుడికి రూ. 10 వేలు నగదు, ఉత్తమ సందేశాత్మక లఘు చిత్రానికి రూ. 10 వేలు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.


