తమిళసినిమా: సినీ రంగంలో కథానాయికలు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. అప్పట్లోనే మహానటి సావిత్రి వంటి వారు కూడా తమ అభిరుచికి తగ్గట్టుగా చిత్రాలు చేశారు. ప్రస్తుతం అగ్రనేటిగా రాణిస్తున్న నయనతార కూడా చిత్ర నిర్మాణం చేపట్టి వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆ కోవలో తాజాగా నటి నిత్యామీనన్ చేరారు. నటిగా ఒక నిర్దిష్టమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న నటి నిత్యామీనన్. నచ్చిన కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న తాజాగా కేయూరి ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి తొలి ప్రయత్నంగా లియో విజన్ సంస్థతో కలిసి చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. లియో విజన్ సంస్థ ఇంతకుముందు నడువుల కొంచెం పక్కత్త కానోమ్, ఇదర్కుదానే ఆశపట్టాయ్ బాలకుమారా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించింది అన్నది గమనార్హం. తాజాగా ఈ సంస్థ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 5 చిత్రానికి నటి నిత్యమీనన్ భాగస్వామి అవుతున్నారు. అదేవిధంగా మరో ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తున్నారు. ఇందులో నటి నిత్యామీనన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. దీనికి డీకే కథ ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫాంటసీ విత్ డార్క్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏ.శక్తి వేల్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేరుకున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో నటించనున్న ఇతర నటీనటులు,సాంకేతిక వర్గం, చిత్ర టైటిల్ వంటి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు.


