తిరువణ్ణామలైలో వైభవంగా మహా కుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

తిరువణ్ణామలైలో వైభవంగా మహా కుంభాభిషేకం

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

● హరోంహరా నామస్మరణాతో హోరెత్తిన ఆలయ ప్రాంగణం

వేలూరు: తిరువణ్ణామలైలోని గిరివలయం రోడ్డులో ఉన్న వళ్లి దైవాని సమేద శివసుబ్రమణ్యయార్‌ కుమర ఆలయ మహా కుంబాభిషేక వైభవం సోమవారం ఉదయం అతి వైభవంగా జరిగింది. ముందుగా వేద పండితులచే గత మూడు రోజులుగా ఆలయ ప్రాంగణంలో యాగ గుండం అమర్చి వివిధ పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన కళశ నీటిని కళశాల్లో ఉంచి ప్రత్యేక యాగ పూజలు చేశారు. అదే విధంగా గోపూజ, గజ పూజ, కళశ పూజలు, నవగ్రహ పూజలు, వినాయకుడి పూజ తదితర పూజలు చేశారు. సోమవారం ఉదయం 9.20 గంటల సమయంలో శివాచార్యుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేసి యాగ గుండంలో ఉంచిన పుణిద నీటిని ఆలయ రాజ గోపురంపైకి తీసుకెళ్లి పుణిద నీటిని గోపురంపై పోసి కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక అన్నదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement