–నేటి నుంచి ఉత్తర్వులు అమలు
తిరుత్తణి: ఆలయాల పవిత్రత పరిరక్షణకు హిందూ దేవాదాయశాఖ ఉపక్రమించింది. దేవతామూర్తులను ఫొటోలు, వీడియోలు తీయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండటం దృష్టి సారించింది. వీటికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆలయాల్లో సెల్‌ఫోన్లు, కెమెరాలను వినియోగించరాదని సెప్టెంబర్ 1 నుంచి నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం ఈ ఉత్తర్వులు అమలు కానున్న నేపథ్యంలో భక్తులు తమ సెల్‌ఫోన్లు, కెమెరాలు, ట్యాబ్ లాంటి ఉపకరణాలను భద్రపరిచేందుకు వీలుగా కొండ ఆలయంలో రెండు ప్రాంతాల్లో ట్రేలు ఏర్పాటు చేశారు. భక్తులు సెల్‌ఫోన్‌కు రూ.5 చొప్పున చెల్లించి రసీదు తీసు కుని తమ వస్తువులు భద్రపరుచుకోవాలని, స్వామి దర్శనం అనంతరం రసీదు చూసి తమ వస్తువులు తీసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
ఘనంగా ఎంజీపీఎంఏ
90వ వార్షికోత్సవం
సాక్షి,చైన్నె : మద్రాసు గ్లాస్ అండ్ ప్లైఉడ్ మర్చంట్స్ అసోసియేషన్ (ఎంజీపీఎంఏ) 90వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చైన్నెలోని వళ్ళువర్ కోటంలో అసోసియేషన్ అధ్యక్షులు జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ త్యాగి పాల్గొని వేడుకలు ప్రారంభించారు.అలాగే అసోసియేషన్ 90వ వార్షికోత్సవ సావనీర్ ను ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్లాస్ ఇండస్ట్రీ 5 ఏళ్లకు ఒకసారి రెట్టింపు అభివృద్ధి సాధిస్తోందని , నిబద్ధత, నిజాయితీ, నమ్మకంతో పనిచేస్తే ఎందులోనైనా అభివృద్ధి సాదించగలం అని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సుభాష్ త్యాగి (గోల్డ్ ప్లస్ ఇండస్ట్రీ)తో చిన్న, మధ్యతరగతి పరిశ్రమ సంస్థలు మంత్రిత్వ శాఖ అయిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ లిమిటెడ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎం .శ్రీవాత్సన్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ వేడుకల్లో ఎంజీపీఎంఏ కార్యదర్శి గణేష్ బాలకృష్ణన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇసుక లారీలు సీజ్
– ఇద్దరు డ్రైవర్ల అరెస్ట్
అన్నానగర్: కడలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం జారీ చేసిన పత్రికా ప్రకటనలో ‘‘కడలూరు జిల్లాలోని నడువీరపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో సరైన పత్రాలు లేకుండా 3 యూనిట్ల ఇసుక, 2 యూనిట్ల ఎం.సంట్ ఇసుకను అక్రమంగ తరలిస్తున్న రెండు ట్రక్కులను స్వాధీనం చేసుకుని, వాటి డ్రైవర్లను అరెస్టు చేశారు.


