గర్భవతిని చేసి మాయమైన భర్త | - | Sakshi
Sakshi News home page

గర్భవతిని చేసి మాయమైన భర్త

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

– న్యాయం చేయాలని చంటిబిడ్డతో

విద్యార్థిని ఆందోళన

తిరువళ్లూరు: ప్రేమించి పెళ్లిచేసుకుని బిడ్డకు జన్మనిచ్చిన తరువాత పరారైన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ చంటిబిడ్డతో కళాశాల విద్యార్థిని కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడం కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా సేలై గ్రామానికి చెందిన వెన్నిల(20) ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈమె ఏకాటూరుకు చెందిన మనోజ్‌కుమార్‌ అనే యువకుడ్ని మూడ సంవత్సరాల పాటూ ప్రేమించి గత ఏడాది గుడిలో పెళ్లి చేసుకుంది. అనంతరం ఇద్దరు కలిసి కాపురమున్నారు. అనంతరం ఇటీవల శిశువుకు జన్మనిచ్చిన క్రమంలో యువతిది తన కులం దకాదన్న కారణంతో ఆమెను వైద్యశాలలోనే వదిలిపెట్టి భర్త మనోజ్‌కుమార్‌ పరారయ్యాడు. ఈ క్రమంలో తననూ ప్రేమించి వివాహం చేసుకుని మగబిడ్డకు జన్మనిచ్చిన తరువాత తన భర్త పరారయ్యాడని, ఇదే విషయంపై ఎస్పీతో పాటు పలువురికి వినతి పత్రం సమర్పించినా ఇంత వరకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ బాధితురాలు చంటిబిడ్డతో సోమవారం కలెక్టర్‌ కార్లాయయం వద్ద ఆందోళనకు దిగారు. తనను మోసం చేసిన మనోజ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రంపై స్పందించిన కలెక్టర్‌ కవిత, బాధితురాలి వద్ద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పోలీసులను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement