సాక్షి, చైన్నె : చైన్నె వేదికగా ఎనిమిది రోజుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన యోనెక్స్‌న్స్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో తమిళనాడు జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం 5 విభాగాల్లో జరిగిన ఈ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్, విమెన్స్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుని రెండు స్వర్ణ పతకాలను సాధించి టాప్‌లో నిలిచింది. హర్యానా, ఉత్తరాఖండ్, తెలంగాణ, కర్ణాటక క్రీడాకారులు కూడా వివిధ విభాగాల్లో పతకాలు సాధించి మెరిశారు.
బహుమతుల ప్రదానం
గురువారం జరిగిన ముగింపు వేడుకల్లో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ సిగమణి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, పతకాలను అందజేశారు. క్రికెట్‌తో సమానంగా బ్యాడ్మింటన్‌క్రీడ శరవేగంగా విస్తరిస్తోందని, ఆదరణ, క్రీడా విజయాల పరంగా క్రికెట్‌తో ఉన్న వ్యత్యాసాన్ని దాదాపు తగ్గించే స్థాయికి ఎదిగిందని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.


