కల్యాణి ప్రియదర్శన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ షురూ | - | Sakshi
Sakshi News home page

కల్యాణి ప్రియదర్శన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ షురూ

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

తమిళసినిమా: ఏ రంగంలోనైనా సక్సెస్‌ ప్రభావం చాలానే ఉంటుంది. అలా టాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్లలో మంచి విజయం కోసం ఎదురుచూసిన నటి కళ్యాణి ప్రియదర్శన్‌. నట వారసత్వంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తొలి రోజుల్లో సరైన సక్సెస్‌లు లేక డీలా పడ్డారనే చెప్పాలి. అయితే ఆ మధ్య తమిళంలో నటుడు శింబుకు జంటగా నటించిన మానాడు చిత్ర విజయం ఈమెకు కాస్త ఊరట నిచ్చింది. అలాంటిది ఇటీవల కళ్యాణి ప్రియదర్శినన్‌ మలయాళంలో నటించిన లోకా చిత్రం అనుహ్య విజయాన్ని సాధించింది. ఉమెన్‌ సెంట్రిక్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నటి కళ్యాణి ప్రియదర్శన్‌కు యాక్షన్‌ హీరోయిన్గా పేరు తెచ్చి పెట్టింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్‌ లోకి రంగ ప్రవేశం చేసే సమయం ఆసన్నమైంది. అక్కడ స్టార్‌ హీరో రణ్వీర్‌ సింగ్‌ జంటగా నటించరున్నారు. జాంబి థ్రిల్లర్‌ కథాంశంతో రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. తొలి చిత్రంతోనే భారీ చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా కళ్యాణి ప్రియదర్శన్‌ అదష్టమని చెప్పాలి. ఇందులో ఆమెది యాక్షన్‌ తో కూడిన కథా పాత్రగా ఉంటుందని తెలిసింది. దీంతో కళ్యాణి ప్రియదర్శన్‌ ప్రస్తుతం ఒక అంతర్జాతీయ శిక్షకుడి వద్ద ఫైట్స్‌ లో శిక్షణ పొందడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం ఆగస్టు నెలలో ప్రారంభం కానట్లు సమాచారం. కాగా దీని తర్వాత నటి కళ్యాణి ప్రియదర్శన్‌ తనకు స్టార్‌ ఇమేజ్‌ ని తెచ్చిపెట్టిన లోకా. చాప్టర్‌ 2 చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం కూడా సెప్టెంబర్‌ నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం.

తమిళసినిమా: కొందరు దర్శకులకు తమకంటూ ఒక బ్రాండ్‌ ఉంటుంది. అలా రామ్‌కు నైవిద్య భరిత కథా చిత్రాలుగా దర్శకుడిగా పేరు ఉంది. చిత్రాల్లో కమర్షియల్‌ అంశాలతో పాటు, జనరంజికమైన, అంతేకాకుండా జాతీయ ,అంతర్జాతీయ అవార్డులను పొందే విధంగా ఉంటాయి. ఇంతకు ముందు రామ్‌ దర్శకత్వం వహించిన కట్రదు తమిళ్‌, తంగమీన్‌ గళ్‌, తరమణి పేరంబు, ఇటీవల తెరకెక్కించిన పరందుపో వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణతో పాటు, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. రామ్‌ తాజాగా దశరథ వహించిన ఏళు కడల్‌ ఏళుమలై చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్‌ ఒకటవ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ది హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు నివిన్‌ బాలి చిన్న గ్యాప్‌ తర్వాత తమిళంలో కథానాయకుడు నటించారు. అదేవిధంగా ఇటీవల కథానాయకుడుగా అవతారమెత్తిన నటుడు సూరి ఇందులో స్టైలిష్‌ పాత్రను పోషించారు. ఇక నటి అంజలి కథానాయక నటించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర టీజర్‌ ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణ పొందినట్లు యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. నటుడు నివిన్‌ బాలి గెటప్పు, వైవిద్య భరిత నటన, నటుడు సూరి వినోదం, నటి అంజలి నటన ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని చెప్పారు. చిత్రం చాలా రోజుల క్రితమే నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శింపబడి పలు విభాగాల్లో అవార్డులను గెలుచుకుందని. దీంతో కాస్త ఆలస్యం అయినా చిత్రాన్ని అక్టోబర్‌ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు.

అక్టోబర్‌ 1న తెరపైకి

ఏళు కడల్‌ ఏళు మలై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement