పురస్కారం ప్రదానం
కొరుక్కుపేట: నాలెడ్జ్ పార్ట్నర్ అయిన వీఐటీ చైన్నె, కన్‌స్ట్రక్షన్ ఆకాడమీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవార్‌ుడ్స 2025 ప్రదానోత్సవం చైన్నెలోని మ్యూజిక్ ఆకాడమీ వేదికగా ఘనంగా జరిగింది. కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఆర్గనైజర్ సిందుభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇస్రో శాటిలైట్ సెంటర్ –బెంగళూరు మాజీ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై , ప్రత్యేక అతిథులుగా వీఐటీ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జివి సెల్వం , నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మాజీ అడ్వైజర్ డాక్టర్ వి తిరుప్పుగళ్ తదితరుల జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్‌స్ట్రక్షన్ రంగంలో విశేష సేవలను అందిస్తున్న పలువురికి కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవార్‌ుడ్స–2025 లను డాక్టర్ మైయిల్ స్వామీ అన్నాదురై చేతుల మీదుగా ప్రదానం చేశారు .చైన్నె టింబర్ అండ్ ప్లేడ్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.రాజశేఖర్‌కి జీవితసాఫల్య పురస్కారంను అందజేశారు. అనంతరం మైల్ స్వామి అన్నాదురై మాట్లాడుతూ నిర్మాణ రంగం ప్రసుత్తం కొత్త ఒరవడిని సంతరించుకుందని అన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని వినూత్న రీతిలో నిర్మాణాలు సాగుతుండటం స్వాగతించదగినదని అన్నారు. అంతకుముందు చైన్నె టింబర్ అండ్ ప్లేడ్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.రాజశేఖర్ ప్రత్యేక ప్రసంగం చేశారు. కలప సుస్థిరత, కలపను ఎలా గుర్తించాలి..? తదితరఅంశాలపై మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కన్‌స్ట్రక్షన్ అకాడమీతో వీఐటీ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ,క్రెడాయ్, ఆర్కిటెక్ట్స్‌అసోసియేషన్, సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ,వివిధ నిర్మాణ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు.


