వైభవంగా మహా కుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మహా కుంభాభిషేకం

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

వేలూరు: రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని సువర్ణపేట గ్రామంలో వెలిసిన శ్రీ భసవేశ్వరర్‌, లింగేశ్వరర్‌, వినాయకుడు, పెరుమాల్‌ దైవాలతో కొలువైన పురాతన ఆలయంలో 12 సంవత్సరాల అనంతరం నూతనంగా పునరుద్ధరించి అష్ట బందన మహా కుంబాభిషేకం అతి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక యాగ గుండాలు ఏర్పాటు చేసి మొదటి కాల యాగ పూజలు జరిగింది. అనంతరం విఘ్నేశ్వర పూజ, గణపతి హోమం, లక్ష్మిహోమం, ధన నవగ్రహ హోమం, వాస్తు శాంతి హోమంతో పాటు నాల్గవ కాల యాగ పూజలను శివాచార్యుల వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం ఉదయం ఆలయంలో గో పూజ, గజ పూజ, నాడి సందానం, పవిత్ర అగ్నిపూజ, ప్రధాన హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం వివిధ పుణిద నదుల నుంచి తీసుకొచ్చిన పుణిద నీటిని కళశాల్లో ఉంచి ప్రత్యేక యాగ పూజలు నిర్వహించి మేళ తాళాల నడుమ శివాచార్యులు, గ్రామస్తులు కళశ నీటిని ఊరేగింగా తీసుకెళ్లి ఆలయ రాజ గోపురంపైకి వెళ్లి కలశ నీటిని పోసం కుంబాభిషేకాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement