కౌంటింగ్‌ కేంద్రాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ కేంద్రాల్లో తనిఖీలు

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

తిరువళ్లూరు: కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను మరో రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ ప్రతాప్‌ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్‌ 23న జరగనున్నాయి. ఎన్నికల అనంతరం గుమ్మిడిపూండి, పొన్నేరి, తిరుత్తణి, తిరువళ్లూరు తదితర నాలుగు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను సెవ్వాపేట పాలిటెక్నిక్‌ కళాశాల, పూందమల్లి, అంబత్తూరు, ఆవడి, మధురవాయల్‌, మాధవరం, తిరువొత్తియూరు ఆరు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను వేపంబట్టులోని శ్రీరామ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపరచి, మే 4న కౌటింగ్‌ నిర్వహించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కలెక్టర్‌ ప్రతాప్‌ ఏర్పాట్లును సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అనంతరం పనులపై ఆఽరా తీశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించే ప్రాంతంలోని బాక్సులను పరిశీలించారు. అనంతరం ఈవీఎంలు భద్రపరచే కేంద్రాలతో సహా ఇతర పనులను ఆరా తీసి పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement