పోటెత్తిన అభిమానం | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన అభిమానం

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

తిరువళ్లూరు: టీవీకే అధినేత విజయ్‌ జిల్లాలో చేపట్టిన రోడ్డుషోకు ప్రజలు అభిమానులు బ్రహ్మఽరథం పట్టారు. ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక్కరోజు వ్యవధి మాత్రమే ఉన్న క్రమంలో జిల్లాకు వీఐపీల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం తిరువళ్లూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల మీధుగా టీవీకే అధినేత విజయ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. చైన్నె నుంచి జిల్లాకు పూందమల్లి వద్ద ప్రవేశించిన విజయ్‌కు మద్దతుదారులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కోలప్పన్‌చ్చేరి వద్ద తిరువళ్లూరు అభ్యర్ది డాక్టర్‌ అరుణ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్డుషో నిర్వహించారు. అనంతరం పాలవేడుకు చేరుకుని అక్కడ పూందమల్లి అభ్యర్థి కుట్టి అలియాస్‌ ప్రకాష్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రకాష్‌కు ఓట్లు వేసి గెలిపించాలని ఒక్కమాటతో ప్రచారాన్ని ముగించారు. అనంతరం అభిమానుల కోలాహలం మద్య తన రోడ్డుషోను కొనసాగించారు. నెమలిచ్చేరికి చేరుకున్న తరువాత అక్కడ భారీగా అభిమానులు తరలివచ్చి స్వాగతం పలికారు. దీంతో పాటు చోళవరం వద్ద గుమ్మిడిపూండి అభ్యర్ది విజయకుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం వండలూరు, జనపసత్రం క్రాస్‌రోడ్డు, నల్లూరు, కారనూడై, ఆత్తూరులోనూ అభిమానుల నడుమ రోడ్డుషో నిర్వహించారు. చైన్నెలోని విల్లివాక్కం, విరుగంబాక్కం తదితర నియోజకవర్గాలలో విజయ్‌ రోడ్‌షో నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement