చైన్నెకి.. సూపర్‌–6 | - | Sakshi
Sakshi News home page

చైన్నెకి.. సూపర్‌–6

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

●డీఎంకే మేనిఫెస్టో విడుదల ● స్టాలిన్‌తో వివిధ సంస్థల ప్రతినిధుల భేటీ ● డీఎంకేకు మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడి

స్టాలిన్‌తో సంస్థల ప్రతినిధులు

సాక్షి, చైన్నె: తేనాంపేటలోని అన్నా అరివాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సంస్థాగత కార్యదర్శి ఆర్‌.ఎస్‌. భారతి సమక్షంలో ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. చైన్నెని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రకటించిన ఈ శ్రీసూపర్‌–6శ్రీలో అంశాలను పొందు పరిచారు. మొత్తంగా 20 వాగ్దానాలు ఉన్నపట్టికీ ఇందులో ఆరింటికి తొలి ప్రాధాన్యతగా పరిగణించారు.

క్రైస్తవ సంస్థల మద్దతు

అన్నాఅరివాలయంలో సీఎం స్టాలిన్‌తో సీఎస్‌ఐ తదితర క్రైస్తవ సంస్థలకు చెందిన ఫాస్టర్లు, బిషప్‌లు , బ్రదర్‌లు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. సుమారు 20 మందికి పైగా ప్రతినిధులు స్టాలిన్‌ను కలిశారు. తమ మద్దతును డీఎంకే కూటమికి ప్రకటించారు.

సూపర్‌ –6ను ఆవిష్కరిస్తున్న స్టాలిన్‌

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాజధాని నగరం చైన్నె కోసం ప్రత్యేకంగా సూపర్‌ –6 ప్రణాళికలను డీఎంకే రూపొందించింది. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్‌ రాజధాని చైన్నె నగరం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘చైన్నె సూపర్‌–6’ పేరిట ఆరు ప్రధాన ఎన్నికల వాగ్దానాలను ఆదివారం చైన్నెలో విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement