1. మెరుగైన ప్రజా సౌకర్యాలు ,మెట్రో వాటర్ కనెక్షన్ లేని ప్రాంతాలకు ఆర్‌ఓ ప్లాంట్‌ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ. అన్ని నివాస ప్రాంతాల్లో హై–మాస్ట్ వీధి దీపాల ఏర్పాటు. కళలు, సంగీతం , సంస్కృతి కోసం ప్రపంచస్థాయి సాంస్కృతిక తిక కేంద్రం నిర్మాణం.
2. రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, మెట్రో , రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తూ 1,000 కొత్త మినీ బస్సుల ప్రారంభం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ట్రాఫిక్ మేనేజ్మెంట్. దీనివల్ల ప్రయాణ సమయం 25 శాతం తగ్గుతుందని అంచనా.
3. గడువులోగా మౌలిక సదుపాయాల పూర్తి, 2027 నాటికి ఎన్నూర్ – పూంజేరి పెరిఫెరల్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పూర్తి. 2028 నాటికి మెట్రో రైలు విస్తరణ , వర్షపు నీటి కాలువల పనుల పూర్తి. 2029 నాటికి ప్రపంచస్థాయి ప్రమాణాలతో విశాలమైన ఫుట్‌పాత్‌లు, నీడను ఇచ్చే చెట్లతో అందమైన రహదారుల నిర్మాణం.
4. వీధి కుక్కల సమస్యకు శాసీ్త్రయ పరిష్కారం లక్ష్యంగా జంతువుల జనన నియంత్రణ ( కేంద్రాల సంఖ్యను మూడు రెట్లు పెంచడం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరిన్ని యానిమల్ షెల్టర్ల ఏర్పాటు.
5. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ఏఐ, యానిమేషన్, గేమింగ్ రంగాల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు. రూ. 10,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. సుమారు 20,000 హై–పెయిడ్ (అధిక వేతనం) ఉద్యోగాల కల్పన.
6. గ్లోబల్ టాలెంట్ గేట్‌వే పేరిట చైన్నె యువతకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ, పరిశోధనా కేంద్రాలు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అంటూ
చైన్నెని కేవలం ఒక నగరంగానే కాకుండా, ప్రపంచ స్థాయి ప్రతిభకు వేదికగా మారుస్తామని ఈ సందర్భంగా స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.


