– వివరాలు 9లోu
కొంగు నగరం రేసులో వీఐపీలు
కొంగు మండలంలో ప్రధాన నగరంగా ఉన్న కోయంబత్తూరులో తాజాగా నాలుగు హాట్ సీట్లపై అందరి దృష్టి పడింది. ఇందులో రెండు స్థానాలలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన ఇద్దరు కింగ్ మేకర్లు పోటీ పడుతున్నారు. దీంతో ఎవర్నీ గెలుపు వరిస్తుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు.
ఓటేసేందుకు దివ్యాంగులకు వాహన సౌకర్యం
●ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటు
చైన్నె జిల్లా ఎన్నికల అధికారి కుమారగురుబరన్ అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ జరిగేలా చూసేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ పరిస్థితిలో, దివ్యాంగులు, వయోవృద్ధులైన ఓటర్లకు కూడా తమ ఇళ్ల నుంచే పోస్టల్ ఓట్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హోసూర్‌లో నిర్వహించిన శ్రీ ఇండియా కూటమి ప్రచార బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో కేంద్రాన్ని టార్గెట్ చేశారు.


