తిరుత్తణి: చిత్తిరై కృత్తిక సందర్బంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం కృత్తిక సందర్భంగా వేకువజామున మూలవర్లకు సుగంద ద్రవ్యాలతో అభిషేక పూజలు చేపట్టి పట్టు వస్త్రాలతో పాటూ బంగారు. వజ్రాభరణాలతో అలంకరించారు. కృత్తికతో పాటు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు తిరుత్తణి ఆలయంకు పోటెత్తారు. కొండ ఆలయంకు వాహనాలు పోటెత్తడంతో ట్రాఫిక్ పరిష్కరించే విధంగా బస్సులు, వ్యాన్‌లు, కార్లను కొండ ఆలయంకు వెళ్లేందుకు ఆంక్షలు విధించి ఆలయం ద్వారా ఉచిత బస్సుల సేవలు చేపట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. కొండ ఆలయ మెట్లు మార్గంతో పాటు ఘాట్‌రోడ్డు ద్వారా భక్తులు కొండ ఆలయ మాడ వీధుల్లో పోటెత్తారు.


