క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

ఆఫ్‌–రోడింగ్‌లో ‘మేజర్‌’ పంజా తిరుమావళవన్‌ ప్రచారంలో విషాదం ●విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి కొబ్బరి బొండం వ్యాపారి కేసులో 9 మందికి యావజ్జీవం ఆలయాల నిర్మాణం పూర్వజన్మ సుకృతం ●అజంతా డాక్టర్‌ శంకర రావు వ్యాఖ్య

సాక్షి, చైన్నె: బీచ్‌ ఇసుకలోనూ సునాయాసంగా ఎంజీ మెజెస్టోర్‌ ప్రయాణం సాగించే విధంగా చైన్నెలోని ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులోని పట్టి పులం తీరంలో ప్రదర్శనను విజయవంతంచేశారు. ఎంజి మోటార్‌ ఇండియా తన సరికొత్త ఎస్‌యూవీగా మేజర్‌ను రూపొందించింది. దీని సామర్థ్యాన్ని చాటే విధంగా చైన్నెలోని ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు వెంబడి ఉన్న పట్టిపులం తీరప్రాంతంలో ప్రదర్శించింది. కఠినమైన బీచ్‌ భూభాగం వదులుగా ఉండే ఇసుక దిన్నెలలో అత్యంత సునాయాసంగా దూసుకుపోతూ తన ఆఫ్‌–రోడ్‌ నైపుణ్యాన్ని ఈ వాహనం చాటుకుంది.ఆఫ్‌–రోడ్‌ మోడ్స్‌లో 10 డ్రైవింగ్‌ మోడ్‌లు ఏర్పాటు చేశారు. ఇసుకలో ప్రయాణించడానికి సాండ్‌ మోడ్‌, కఠినమైన ఉపరితలాలపై పట్టు కోసం ‘క్రావల్‌ కంట్రోల్‌’ మోడ్‌ ప్రత్యేక ఆకర్షణ తీర్చిదిద్దారు.

తిరువొత్తియూరు: తిరుమావళవన్‌ ఎన్నికల ప్రచారంలో విద్యుత్‌ షాక్‌ కొట్టి యువకుడు మతి చెందిన ఘటన విషాదం నింపింది. వివరాలు.. తిట్టకుడి నియోజకవర్గ డీఎంకే అభ్యర్థికి మద్దతుగా విడుతలై చిరుతైగల్‌ కట్చి( వీసీకే ) పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్‌ ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొనేందుకు తిట్టకుడి సమీపంలోని పుడియూరు గ్రామానికి చెందిన ఇళంగోవన్‌ కుమారుడు అజిత్‌ (19) వచ్చారు. ఆ సమయంలో అజిత్‌ పార్టీకి చెందిన ఇనుప జెండా కరన్రు పట్టుకున్నారు. దురదష్టవశాత్తూ ఆ జెండా కర్రపైన ఉన్న విద్యుత్‌ తీగలకు తగలడంతో అజిత్‌ విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అజిత్‌ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధవీకరించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తిరువొత్తియూరు: కరూర్‌ జిల్లా, చిన్న ఆండాంకోవిల్‌ ప్రాంతానికి చెందిన కష్ణమూర్తి (25) కొబ్బరి బొండం వ్యాపారి. 2020 సెప్టెంబర్‌ 18న కరూర్‌–కోయంబత్తూర్‌ రోడ్డులో వ్యాపారం చేసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కరూర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టులో జరిగిన విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ క్రింది విధంగా తీర్పునిచ్చారు. హత్యా నేరానికి పాల్పడిన గోకులకష్ణన్‌, దురైపాండి, ప్రేమ్‌కుమార్‌, మణికంఠన్‌, కేశవన్‌, అరవింద్‌కుమార్‌, తమిళరసన్‌, అజిత్‌, సెంథిల్‌ అనే 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సరైన ఆధారాలు లేని కారణంగా కావ్య రమేష్‌, కలైసెల్వన్‌, విమల్‌ బషీర్‌ అనే ముగ్గురిని కోర్టు విడుదల చేసింది. శిక్ష పడిన 9 మందిని ప్రస్తుతం తిరుచ్చి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

కొరుక్కుపేట: ఆలయాల నిర్మాణం చేపట్టడం పూర్వజన్మ సుకృతం అని అజంతా సంస్థ అధినేత అజంతా డాక్టర్‌ కనిగెలుపుల శంకర రావు అన్నారు.చైన్నైశివారు ప్రాంతం మన ఊరు ప్రాంతంలో జగదాచార్య సహస్రాబ్ది స్మారక సభ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఆళ్వార్‌ ఆచార్యర్‌ మందిరం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి . ఇందులో ఐదు సన్నిధులలో ఒక భాగం విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు ఆదివారం చైన్నె పుదుపేట్‌లోని నాథముని హాలు వేదికగా చారిటబుల్‌ ట్రస్ట్‌ ట్రస్టీలతో, దాతలు, ఆలయ ట్రస్టీ లు, ప్యాట్రన్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సభ వ్యవస్థాపకులు ఊసూరు నందకుమార్‌, ఊసూరు లత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అజంతా డాక్టర్‌ కే శంకర రావు, ప్రత్యేక అతిథిగా బీఎల్‌ కుమారవేల్‌, ఆలయ ప్యాట్రన్‌, గోపురం కుంకుమ అధినేత వైవీ హరికృష్ణా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement