15 వేల డమ్మీ చెక్‌లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

15 వేల డమ్మీ చెక్‌లు స్వాధీనం

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

తిరువళ్లూరు: తాంబరం నుంచి తిరుత్తణి వైపు వెళుతున్న 15 వేల డమ్మీ చెక్కులను తనిఖీ బృందాలు ఆదివారం స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఏప్రల్‌ 23న జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో డబ్బుతోపాటు ఇతర వస్తువులతో ప్రలోభాలకు గురిచేయకుండా నిరోదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆదివారం పూందమల్లి నియోజకవర్గంలోని మూలకరై వద్ద తనిఖీ బృందాలు చేస్తున్న సమయంలో మినీ గూడ్స్‌ లారీల్లో 15 వేల డమ్మీ చెక్కులు వుండడాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి తిరుత్తణి అన్నాడీఎంకే అభ్యర్థికి చెందినవిగా భావిస్తున్నారు. ఓటర్లకు పంచడానికి తీసుకెళుతున్నట్టు నిర్ధారించిన అధికారులు వాటిని సీజ్‌ చేసి విచారణను ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement