కోయంబత్తూరు జిల్లాలోని అత్యంత కీలకమైన వీఐపీ నియోజకవర్గంగా తొండా ముత్తూరు ఉంది. ఇక్కడ మొత్తం ఓటర్లు: 2,93,324, వీరిలో పురుషులు: 1,41,641, మహిళలు: 1,51,577, ఇతరులు 106 మంది ఉన్నారు. అన్నాడీఎంకేలో పళణి స్వామి తర్వాత కీలకంగా ఉన్న నేత ఎస్‌పీ వేలుమణి ఇక్కడ నాలుగో సారి విజయం దిశగా ఉరకలు వేస్తున్నారు.అన్నాడీఎంకేలో శక్తివంతమైన నాయకుడైన వేలుమణి గెలుపును అడ్డుకునే దిశగా డీఎంకే తరపున ఇక్కడ కొత్త ముఖంగా కార్తికేయన్ పోటీలో ఉన్నారు. కొంగు మండలం డీఎంకే ఇన్‌చార్జ్‌గా ఉన్న సెంథిల్ బాలాజీ వ్యూహాలకు అనుగుణంగా కార్తికేయన్ ఓట్ల వేటలో ఉన్నారు.ఇక, విజయ్ టీవీకే తరపున సతీష్ రాజ్ పోటీలో ఉన్నారు. ఈ అభ్యర్థి ఎస్‌పీ వేలుమణి రాజకీయ గురువైన కేపీ రాజు కుమారుడు కావడం గమనార్హం. డీఎంకే, టీవీకేలోని యువ నేతలైన ఈ అభ్యర్థులు అత్యంత బలమైన నేతగా ఉన్న ఎస్‌పీ వేలుమణిని ఢీ కొట్టేందుకు సర్వాస్త్రాలను ఒడ్డుతున్నారు. ఇక, మైనారిటీ ఓట్లను గురి పెట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా అభ్యర్థిని నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) నేత సీమాన్ రంగంలోకి దించారు. ఆ పార్టీ తరపున రజబు నిషా మైనారిటీలను కలుపుకుని ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. అన్నాడీఎంకే కంచుకోటను బద్దలు కొట్టే దిశగా సీఎం స్టాలిన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం. అన్నాడీఎంకేలో వేలుమణిపై అసంతృప్తితో ఉన్న స్థానిక నేతలందరూ సతీష్ రాజ్ వెంట తిరుగుతుండటంతో సమరం నువ్వా..నేనా..అన్నట్టుగా మారింది.
‘పొల్లాచ్చి’లో
తిరుగు లేనట్టేనా..?


