డీఎంకే బూత్‌ ఏజెంట్లకు బంపర్‌ ఆఫర్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎంకే బూత్‌ ఏజెంట్లకు బంపర్‌ ఆఫర్‌

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

– డీఎంకే భూపతి నగదు ప్రకటన

తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి డిపాజిట్‌ కోల్పేయే బూత్‌లో ఉన్న డీఎంకే ఏజెంట్లకు రూ.1.50 లక్ష బహుమతి అందజేస్తానని డీఎంకే మాజీ జిల్లా కార్యదర్శి భూపతి కార్యకర్తలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. డీఎంకే కూటమిలో తిరుత్తణిలో డీఎండీకే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కృష్ణమూర్తినాయుడుకు మద్దతుగా తిరుత్తణి మున్సిపాలిటీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులతో పాటు కూటమి పార్టీల శ్రేణులు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం 20వ వార్డులో ప్రచారం చేశారు. ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే వున్నందున కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి డీఎంకేను గెలిపించాలని ఓటర్లను అభ్యర్తిస్తున్నారు. పట్టణంలోని ఎన్నికల బూత్‌లలో అన్నాడీఎంకే డిపాజిట్‌ కోల్పోయే బూత్‌లోని డీఎంకే ఏజెంట్లకు రూ.1.50 లక్ష, అత్యధిక ఓట్లు సాధించే బూత్‌లకు రూ.లక్ష బహుమతి అందజేస్తామని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. నగర కార్యదర్శి వినోద్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ స్వామిరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement