సాక్షి, చైన్నె: పార్లమెంటులో 33శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడమే కాకుండా, ఆ అపజయాన్ని బాణసంచా కాల్చి , స్వీట్లు పంచి వేడుకగా జరుపుకోవడం విచారకరం అని పీఎంకే నేత అన్బుమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో . స్టాలిన్ చరిత్రలో ఒక శ్రీద్రోహిశ్రీగా నిలిచిపోతారని ఆయన విమర్శించారు. శనివారం అన్బుమణి మాట్లాడుతూ
మహిళా సాధికారతకు అడ్డుకట్ట
మహిళలకు రాజకీయ అధికారం దక్కకుండా చేయడంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు గత 33 ఏళ్లుగా కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే స్టాలిన్, మహిళలకు అన్యాయం చేయడంలో మాత్రం ముందున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన వలన తమిళనాడు సీట్లు తగ్గుతాయని స్టాలిన్ ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. వాస్తవానికి తమిళనాడు సీట్లు 39 నుండి 59కి పెరుగుతాయని ప్రధాని, హోం మంత్రి పార్లమెంటులో హామీ ఇచ్చినా స్టాలిన్ మొండిగా వ్యవహరించారని మండిపడ్డారు.
మహిళా వ్యతిరేక
మనస్తత్వం:
మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టడం స్టాలిన్‌కు ఇష్టం లేదని, వారు ఎప్పుడూ వంటింటికే పరిమితం కావాలనే శ్రీపెన్నడిమైశ్రీ (మహిళా బానిసత్వ) బుద్ధి ఆయనలో ఉందని ఘాటుగా విమర్శించారు. బిల్లు వీగిపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు వెళ్లాల్సిన 20 మంది తమిళ మహిళల అవకాశాన్ని స్టాలిన్ చెడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడాన్ని బాణసంచా కాల్చి సంబరం చేసుకోవడం స్టాలిన్ లోని శ్రీశాడిజంశ్రీకు నిదర్శనమని అన్బుమణి అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదుల ఊచకోతను చూసి హిట్లర్ ఎలాగైతే ఆనందించాడో, మహిళల రాజకీయ ఎదుగుదల దెబ్బతినడం చూసి స్టాలిన్ అలాగే సంతోషిస్తున్నారని విమర్శించారు.


