21 నియోజకవర్గాలకు 184 మంది పోటీ | - | Sakshi
Sakshi News home page

21 నియోజకవర్గాలకు 184 మంది పోటీ

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 6వ తేదిన జరగనున్న నేపద్యంలో నామినేషన్‌లు దాఖ లు ఈనెల 12 నుంచి 19వ తేది వరకు జరిగింది. ఈ సందర్బంగా వివిద రాజకీయ పార్టీలు, స్వత్యంత్ర అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. నామినేషన్‌లు పునః పరిశీలన, తిరష్కరణలు పూర్తి కావడంతో తుది జాబితాను అధికారులు సిద్దం చేశారు. ఇదిలా ఉండగా కాట్పాడి నియోజక వర్గంలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ షణ్మగ సుందరం, ఎస్‌పి సెల్వకుమార్‌లు మంగళవారం ఉదయం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలోని 21 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 184 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. తిరుపత్తూరు జిల్లాలో మాత్రం నాలుగు నియోజకవర్గాల్లో 113 మంది నామినేషన్‌లు దాఖలు చేయగా అందులో 59 నామినేషన్‌లు తిరష్కరించడం జరిగిందన్నారు. అదే విధంగా వేలూరు జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో మొత్తం 71 మంది బరిలో ఉన్నారు. వీరిలో వేలూరులో 17 మంది, కాట్పాడిలో 15, అనకట్టులో 14, కేవీ కుప్పంలో 10, గుడియాత్తంలో 15 మంది బరిలో ఉన్నారు. అదే విధంగా రాణిపేట జిల్లా లో మొత్తం 59 మంది పోటీలో ఉండగా అరక్కోణంలో 13 మంది, షోళింగర్‌లో 20 మంది, రాణిపేటలో 14 మంది, ఆర్కాడులో 12 మంది పోటీలో ఉన్నట్లు తెలి పారు. ఇదిలా ఉండగా షోళింగర్‌, వేలూరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో మాత్రం అధికంగా అభ్యర్థులు పోటీలో ఉండగా రెండు ఈవీఎం మిషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఈవీ ఎం మిషన్‌లోను 15 మంది అభ్యర్థుల పేరుతో పాటు ఒక నోటాకు బటన్‌ ఉంటుందని ఓట ర్లు వీటిని పరిశీలించి ఓట హక్కును వినియోగించుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement