సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కై ్లమాక్స్‌కు చేరుకున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ శుక్రవారం ఈరోడ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అసలు పోటీ కేవలం ఎన్‌డీఏ, డీఎంకే మధ్య మాత్రమేనని, తకు ఇతరులు ఎవ్వరితోనూ పోటీ లేదంటూ స్పష్టం చేశారు. ఈరోడ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ కూటమి గెలుపు కోసం అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారని తెలిపారు. శనివారం కోయంబత్తూర్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగిస్తారన్నారు. మరుసటి రోజు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోడ్ జిల్లా మొడక్కురిచ్చి అభ్యర్థి కృతిక శివకుమార్ తరఫున శివగిరిలో రోడ్ షో నిర్వహించనున్నారన్నారు.
డీఎంకే డ్రామా
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లుపై ఆయన స్పందించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33% మహిళా రిజర్వేషన్ల విషయంలో డీఎంకే డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఈ రిజర్వేషన్‌తో పురుషుల అవకాశాలు తగ్గవని ఆయన హామీ ఇచ్చారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచడం ద్వారా రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుందని, దీనిని సీఎం స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ప్రజల కోసం ఏమీ చేయని స్టాలిన్, కేవలం తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే ఏకై క లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేంద్రంతో అనవసర ఘర్షణ వైఖరి పెట్టుకుని రాష్ట్రానికి రావాల్సిన పథకాలను సాధించడంలో స్టాలిన్ విఫలమయ్యారని మండిపడ్డారు.


