కాన్‌సిటీ చిత్రంలో రారా రంగయ్య | - | Sakshi
Sakshi News home page

కాన్‌సిటీ చిత్రంలో రారా రంగయ్య

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

తమిళసినిమా: నటుడు అర్జున్‌దాస్‌, అన్నా బెన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కాన్‌సిటీ.పవర్‌ హౌస్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంతో హరీష్‌ దురైరాజ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటు డు యోగిబాబు, వడివుక్కరసి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రంలోని రారా రంగయ్య అనే పల్లవితో సాగే కొరియన్‌ ఫ్యామిలీ సాంగ్‌ను యూనిట్‌ వర్గాలు విడుదల చేశాయి. మోహన్‌రాజ్‌ రాసిన ఈ పాటకు శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందించారు. ఊరా లోకల్‌ పాటగా రూపొందిన ఈ పాటలో చిత్రంలోని ప్రముఖ నటీనటులందరూ నటించడం విశేషం! ఈ పాటలో సంగీతం, సాహిత్యం, చిత్రీకరణ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. చిత్రంలో ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్ర కఽథ నగర ప్రాంతంలో అప్పుల పాలైన ఒక మిడిల్‌క్లాస్‌ కుటుంబం ఇతివృత్తంతో సాగుతుందని చెప్పారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదం తదితర ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఫ్యామి లీ ఎంటర్‌టెయినర్‌ చిత్రం కాన్‌సిటీ అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను మంగుళూర్‌, చైన్నె, ముంబై ప్రాంతాల్లో చిత్రీకరించి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌ డేట్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చిందన్నారు. తాజాగా విడుదల చేసిన తొలి సింగిల్‌ సాంగ్‌ రారా రంగయ్య పాట విశేష ఆదరణ పొందుతోందని చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement