తొలిసారిగా పోటీలో.. | - | Sakshi
Sakshi News home page

తొలిసారిగా పోటీలో..

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

తమిళగ వెట్రికళగం ఆవిర్భావంతో ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌ తొలిసారిగా చైన్నె శ్రీపెరంబదూరు, తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌, చైన్నె టీ నగర్‌, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్‌ అర్జున విల్లివాక్కం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక రెండు దశాబ్దాలుగా పార్టీ నడుపుతున్నప్పటికీ ప్రప్రథమంగా తన స్వస్థలం శివగంగ జిల్లా కారైక్కుడిలో నామ్‌ తమిళర్‌ కట్చి(ఎన్‌టీకే) కన్వీనర్‌ సీమాన్‌ పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో న్యూ జస్టిస్‌ పార్టీ తరఫున మదురై సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ మహిళా నేత, నటీ కుష్భు భర్త, సినీ నటుడు, దర్శకుడు సుందర్‌.సి తొలి సారిగా పోటీలో ఉన్నారు. ఆయన అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంలో పోటీ చేస్తుండడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement