తిరువళ్లూరు: డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్‌కు మద్దతుగా బుల్లితెర నటుల బృందం శుక్రవారం ఉదయం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించింది. తిరువళ్లూరు డీఎంకే అభ్యర్థి వయలూరు, సూరకాపురం, కడంబత్తూరు, ముదుగూ రు, తిరుపందియూరు తదితర ప్రాంతాల్లో డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్ తన మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీజీ రాజేంద్రన్‌కు మద్దతుగా బుల్లితెర నటులు రిషీకాంత్, రూపశ్రీ, అర్చన, ప్రేమీవెంకట్, భరత్ తదితరు లు ప్రచారం నిర్వహించారు. డీఎంకే అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరిస్తూ ప్రచారం చే శారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలను వంద శాతం అమలు చేస్తామన్నా రు. ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే నియోజకవర్గాన్ని మరింత అబివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి కొండజేరి రమేష్, ఇందిర విద్యాసంస్థ అదినేత ఇందిర రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.


