తిరుత్తణి: తిరుత్తణి నియోజకవర్గంలో డ్యూటీ పోలీసులు పోస్టల్ బ్యాలట్ ఓట్లు ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23న పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో తిరుత్తణి నియోజకవర్గంలోని పోలీసులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నవారికి పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓట్లు వేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓట్లు వేసేందుకు శుక్రవారం ఏర్పాట్లు చేశారు. 560 మంది పోలీసుల్లో తొలిరోజు 250 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.


