బ్యాలెట్‌ పేపర్ల ఏర్పాటు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ పేపర్ల ఏర్పాటు ప్రారంభం

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

తిరువళ్లూరు: ఈవీఎంలలో అభ్యర్థుల గుర్తులతో కూడిన బ్యాలెట్‌ పేపర్‌లను అమర్చే పనులను అధికారులు గురువారం నుంచి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు 23వ తేదీన జరగనున్నాయి ఇప్పటికే నామినేషన్‌ల ప్రక్రియ ముగిసిన క్రమంలో ప్రచారం సైతం తుదిదశకు చేరుకుంది. ఈక్రమంలో ఎన్నికలకు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే వున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే అధికారులకు ఎన్నికల నిర్వాహణకు సంబందించి రెండు విడదతలుగా శిక్షణ సైతం పూర్తి చేశారు. ఈనేపథ్యంలో గురువారం ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, గుర్తుతో కూడిన బ్యాలెట్‌ పేపర్లను అమర్చే పనులను అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈవీఎం, సీపీయూ, వీవీప్యాట్‌లను సరి చూసి తరువాత పేపర్లను అమర్చుతున్నారు. జిల్లాలో మూడువేలకు పైగా ఈవీఎంలు వున్న క్రమంలో ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో వుంచి పనులను చేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రతాప్‌ తెలిపారు. రెండు రోజుల్లో పనులను పూర్తి చేసి ఈవీఎంలను భద్రపరుస్తామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement