సెమీకండక్టర్‌ టెక్నాలజీలో ఆవిష్కరణలు | - | Sakshi
Sakshi News home page

సెమీకండక్టర్‌ టెక్నాలజీలో ఆవిష్కరణలు

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

కొరుక్కుపేట: సెమీకండక్టర్‌ టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలు చేపట్టాలని విద్యార్థులకు అతిథులు పిలుపునిచ్చారు. ఎస్‌ఆర్‌ఎం ఐ ఎస్‌టీ వడపళని క్యాంపస్‌లోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సిలికాన్‌ ఒడిస్సీ 2026– చిప్స్‌ భవిష్యత్తును రూపొందించడం, సిగ్మా కమ్యూనిటీ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్టూడెంట్‌ సెమీకండక్టర్స్‌ చైన్నె చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనితా స్టాలిన్‌,మైక్రోచిప్‌ టెక్నాలజీ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ మేనేజర్‌ అనుపమ పరిశ్రమకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలు, అభ్యాసం ప్రాముఖ్యతను వివరించారు. ఎఫ్‌ఈటీడీన్‌ డాక్టర్‌ సి.వి. జయకుమార్‌, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్‌ ఎ. షిర్లీ ఎడ్వర్డ్‌, పూర్వ విద్యార్థుల వ్యవహారాల డైరెక్టర్‌ డాక్టర్‌ రత్నం, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వి.పి. కవిత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement