సాక్షి, చైన్నె : కంటి వైద్య రంగ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో మరోసారి మర్మోగించే విధంగా డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రికి చెందిన ఇద్దరు ప్రముఖ సీనియర్ వైద్యులు అంతర్జాతీయ స్థాయిలో అత్యున్న త అవార్డులను అందుకున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరిగిన ’అమెరికన్ సొసైటీ ఆఫ్ కాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ’(ఏఎస్‌సీఆర్‌ఎస్) 44వ ఫిల్మ్ ఫె స్టివల్‌లో వీరికి ఈ గుర్తింపు లభించింది. అధునాతన కంటి శస్త్రచికిత్స పద్ధతులపై రూపొందించిన విద్యాపరమైన చిత్రాలకు గాను ఈ గౌరవం దక్కింది.. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ అతియా అగర్వాల్ ప్రథమ బహుమతిగా పర్పుల్స్ ఆఫ్ ఐరిస్ రిపేర్ చి త్రానికి అవార్డును అందుకున్నారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అగర్వాల్స్ రిఫ్రాక్టివ్ అండ్ కార్నియా ఫౌండేషన్ చీఫ్ డాక్టర్ సూసన్ జాకబ్ రన్నరప్ అవార్డుగా ‘రీబ బ్లింగ్ ఇన్ కెరాటోప్లాస్టీ‘ చిత్రానికి అందుకన్నారు. ఈ అవార్డును అందుకున్న వైద్యులు గురువారం చైన్నెలో మీడియాతో మాట్లాడుతూ, గ్లోబల్ స్టేజ్‌పై ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ప్రధానంగా కంటి వైద్య రంగంలో మహిళా నాయకత్వానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.


