ఎక్కివచ్చాం.. అయ్యాప్పా! | - | Sakshi
Sakshi News home page

ఎక్కివచ్చాం.. అయ్యాప్పా!

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

తమిళసినిమా: నటుడు యోగిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం సన్నిధానం పీఓ. ఈ చిత్రంలోని ఏరి వందోం అయ్యాప్పా(ఎక్కి వచ్చాం అయ్య ప్పా) అనే పల్లవితో సాగే తొలి పాటను యూనిట్‌ వర్గాలు విడుదల చేశారు. శబరిమలకు చెందిన భక్తిని, నమ్మకాన్ని, దానికి సంబంధించిన అందమైన సన్నివేశాలతో కూడిన భక్తుల మనసులను పరవశింపజేసే ఈ పాటను గీత రచయిత మోహన్‌రాజా రాశారు. గా యనీ గాయకులు అభిషేక్‌ రాజా, విష్ణురామ్‌ ఆలపించారు. ఏజీఆర్‌ సంగీత భాణీలను కట్టిన ఈ పాట ప్రే క్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని యూనిట్‌ స భ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. యోగిబాబు, రూపేష్‌ శెట్టి, వర్షా విశ్వనాధ్‌ ప్ర ధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నటి సితారా, ప్రమోద్‌శెట్టి, మూనార్‌ రమేష్‌,గజరాజ్‌ ,రాజా రుద్రకొడి, సాధ్విక్‌, హశ్విన్‌ హాసన్‌, వినోద్‌సాగర్‌, కల్కీ రాజా, విశాలిని, దక్షికా లక్ష్మణన్‌, మధుసూదన్‌రావ్‌, మొదలగు పలువురు ముఖ్య పాత్రలను పోషించారు. సర్వదా సినీ కరేజ్‌, షీమోకా క్రియేషన్స్‌ సంస్థల అధినే తలు మధుసూదన్‌రావ్‌,వీ.వివేకానందన్‌,రామస్వామి వేలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి షబీర్‌ బదాన్‌ సహ నిరార్మతగా వ్యవహరిస్తున్నారు. కాగా అముద భారతి క థ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాని కి అజును అయ్యప్పన్‌ కథ,కధనాలను అందించారు. ఇది అందమైన అనుబంధాలతో కూడిన శబరిమల విశేషాలను, అయ్యప్ప భక్తులు ఎదుర్కొనే అనూహ్య సంఘటలు, తద్వారా వారి పయనంలో జరిగే పరిఱామాలను ఆవిష్కరించే అద్భుతమైన భక్తిరస కథా చిత్రంగా సన్నిధానం పీఓ చిత్రం ఉంటుందని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు చేరన్‌, నటి మంజువారియర్‌లు విడుదల చేశారని, ఆ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందని చెప్పారు. కాగా తమిళం,తె లుగు, కన్నడం,మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని విదుదల తేదీని త్వరలోనే అ ధికారికంగా వెల్లడిస్తామని పే ర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement