తమిళసినిమా: నటుడు జీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లక్ష్మీ కాంతన్ కొలై వళక్కు. దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2 ఎం సినిమాస్ పతాకంపై వీ.శబరీస్ నిర్మిస్తుండగా దర్శకుడు దయాళ్ పద్మనాభన్ కు చెందిన డీ.పిక్చర్స్ సంస్థ సహనిర్మాణ బాద్యతలను నిర్వహిస్తోంది. నటుడు రంగరాజ్‌పాండే,నటి బ్రిగిడా సాగా, పరుత్తివీరన్ శరవణన్, మారన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దర్బుక శివ సంగీతాన్ని, ఎంవీ.పన్నీర్ సెల్వం ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. కాగా సస్పెన్ ,థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు దయాళ్ పద్మానాభన్ తెలుపుతూ చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా చిత్రంలోని ప్రధాన పాత్రలను నటుడు విజయ్‌సేతుపతి పరిచయం చేశారని, ఆ వీడియోకు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. దీంతో చిత్రంపై ఆసక్తి పెరుగుతోందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారి అంచనాలను రీచ్ అయ్యే విధంగా లక్ష్మీకాంతన్ కొలై వళక్కు చిత్రాన్ని పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించినట్లు చెప్పారు. కాగా చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలతో పాటు, చిత్ర విడుదల గురించి త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.


