సాక్షి, చైన్నె : నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ బుధవారం చేసిన ఓ వాగ్దానం అందర్నీ విస్మయంలో పడేసింది. తమను అధికారంలోకి తీసుకొస్తే గాడి పాలను ఎగుమతి చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. శివగంగ జిల్లా తిరుభువనం పరిధిలోని మానామధురై నియోజకవర్గంలో సీమాన్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.తిరుభువనం పార్టీ అభ్యర్థి పాల్‌కు మద్దతుగా జరిగిన ప్రచారంలో సీమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు ఓటేస్తే మద్యం దుకాణాలు మూసి వేస్తామన్నారు. ఈ ప్రాంతం ఉత్పత్తి అయ్యే కొబ్బరి పాలును అక్కడక్కడా అమ్ముతారని పేర్కొంటూ, వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు, రైతులకు మేకల ఫారాలు, పశువుల ఫారాలు, గాడిదల ఫారాలు ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తారు. వీటి పాలను పలు ప్రాంతాలకు ఎగుమతి చేయిస్తామన్నారు.
సీమాన్


