నటుడు ప్రదీప్ రంగనాధన్, నటి కృతిశెట్టి, ఎస్‌జే.సూర్య, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తదితరులు
తమిళసినిమా: నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎల్‌ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) నటి కృతిశెట్టి నాయకిగా నటించిన ఇందులో నటుడు సీమాన్, ఎస్‌జే.సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నటి నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ, ఎస్ ఎస్. లలిత్‌కుమార్‌కు చెందిన సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. అనిరుధ్ సంగీతాన్ని, రవివర్మన్ ఛాయాగ్రణంను అందించిన ఈ చిత్రం గత వారం తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో థ్యాంక్స్ గివింగ్ మీట్‌ను నడుస్తోంది. ఈ సమావేశంలో చిత్ర కథానాయకుడు ప్రదీప్ రంగనాధన్ మాట్లాడుతూ 2023లో దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఈ చిత్ర కథను చెప్పగానే అందులో నటించడానికి ఫిక్స్ అయ్యానన్నారు. ఆ తరువాత పలు మార్లు పలు ఆటంకాలను ఎదుర్కొని షూటింగ్‌ను పూర్తి చేసుకుందని చెప్పారు. దీంతో చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కొరవడుతుందేమో, చిత్రంపై క్రేజ్ తగ్గుతుందేమోనని చాలా భయపడ్డామన్నారు. ఎట్టకేలకు ఎల్‌ఐకే చిత్రం విడుదలై ప్రేక్షకులను అలరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం తనకు మంచి అనుభవం అని నటి కృతిశెట్టి పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు విఽఘ్నేశ్ శివన్ మాట్లాడుతూ ఈ చిత్రం విడుదల కావడమే తనకు బ్లాక్ బస్టర్ అయినట్లు అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రాన్ని నటుడు ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో మరో రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే ఈ చిత్రాన్ని మళ్లీ ఈనెల 17న విడుదల చేస్తున్నట్లుగా మరిన్ని వసూళ్లూ సాధించే విధంగా బూస్ట్ అప్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తమిళసినిమా: సామాజిక బాధ్యతతో కూడిన జనరంజక కథా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు లభిస్తుంటాయి. అలా 2014లో విడుదలైన చిత్రం కుట్రం కడిదల్. బ్రహ్మ.జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జేఎస్‌కే సతీష్‌కుమార్ నిర్మించారు. తండ్రీకొడుకుల ఇతి వృత్తంతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పొందేవరకూ వెళ్లింది. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా కుట్రం కడిదల్–2 రూపొందింది. జేఎస్‌కే.సతీష్‌కుమార్ నిర్మించి ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఎస్‌కే.జీవా దర్శకత్వం వహించారు. పాండియరాజన్ ఇంతకు ముందెప్పుడూ నటించని పాత్రను ఈ చిత్రంలో నటించారని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా అప్పుకుట్టి, బాలాజీ మురుగదాస్, దీపక్, పావల్, పీఎల్. తేనప్పన్, చాందిని తమిళరసన్, కీర్తీచావ్లా, విజీ చంద్రశేఖర్, లవ్లిన్, జోవిత లీవింగ్‌స్టన్, రోషన్ ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి కథనాన్ని ఎస్‌కే.జీవా, కేఎస్‌కే.సతీష్‌కుమార్ రచించారు. డీకే సంగీతాన్ని, సతీష్ .జీ చాయాగ్రహణం అందించిన ఈ చిత్ర షూటింగ్‌ను కొడైక్కానల్, దిండిగల్, నాగర్‌కోవిల్, చైన్నె ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు చెప్పారు.
కుట్రం కడిదల్–2 చిత్రంలో సతీష్‌కుమార్, కీర్తీచావ్లా,
విజీ చంద్రశేఖర్
కుట్రం కడిదల్
సీక్వెల్ రెడీ!


