ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

తిరువళ్లూరు: జిల్లాలో ఎన్నికల విధులను నిర్వహించనున్న అధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. తిరువళ్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు రానున్న 23న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అధికారులకు మూడుదశల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. రెండవదశ శిక్షణ తరగతులు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ ఎన్నికల విధులను నిర్వహించే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. మాక్‌పోలీంగ్‌తో పాటూ ఇతర వాటిపై ఏజెంట్‌లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన తరువాతే ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంబించాలని సూచించారు. దీంతో పాటూ పోస్టల్‌ బ్యాలెట్‌ను వందశాతం ఉపయోగించుకోవాలని సూచించారు. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన తరువాత సీల్‌ వేసే సమయంలో ఏజెంట్లుకు పూర్తీ సమాచారం ఇవ్వాలని సైతం సూచించారు. మొత్తం 19,224 మంది సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొననున్నట్టు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement