కొరుక్కుపేట: శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి వసంతోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి .అందులో భాగంగా మూడు రోజుల పాటు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మంగళవారం రాత్రి ఆలయ మహా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోనేరులో తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని విశేషంగా వివిధ రకాల పుష్పాలతో, స్వర్ణభరణాలతో వైభవంగా అలంకరించి తెప్పపై వేంఛేపు చేసి తెప్పోత్సవం ను కనుల పండువుగా నిర్వహించారు. చైన్నె నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తెప్పోత్సవాన్ని తిలకించి తరించారు. ఆలయ పాలక మండల సభ్యులు తెప్పను లాగుతూ తన్మయత్వం పొందారు. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేయగా, ఎస్‌కేపీడీ అండ్ చారిటీస్ కార్యదర్శి ఎం కిషోర్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.


