గాయని ఎస్పీ శైలజకు ఇసై కలైవాణి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

గాయని ఎస్పీ శైలజకు ఇసై కలైవాణి పురస్కారం

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

కొరుక్కుపేట: కళారంజని చారిటబుల్‌ ట్రస్ట్‌, కళారంజిని స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ ఆధ్వర్యంలో 25వ వార్షిక తమిళ నూతన సంవత్సర , కళాకారుల పురస్కార ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలలో విశేష సేవలను అందిస్తున్న ప్రముఖులకు ఈ సందర్భంగా పురస్కారాలను ప్రధానం చేశారు. కళారంజని చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు, సంగీత దర్శకులు డాక్టర్‌ జే. శ్రీనిబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చైన్నె మొగప్పైర్‌లో ఉన్న వెంకటేశ్వర వెడ్డింగ్‌ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కెవిజి ప్రాపర్టీస్‌ ప్రయివేటు లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వి. గోపాలకృష్ణన్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా సంగీతానికి విశేష కృషి చేస్తున్న ప్రముఖ సినీ నేపద్య గాయని ఎస్పీ శైలజాని ఇసై కలైవాణి పురస్కారంతో సత్కరించారు. అలాగే సమాజ సేవలో రాణిస్తున్న ఐకాస్‌ టెక్నాలజీస్‌ అధినేత ఎం . శోభా రాజా కి డైనమిక్‌ లేడీ పురస్కారం, ఇంకా చిన్మయ మిషన్‌కు చెందిన శ్రీ స్వామి సురేశానందకి భక్తి రత్న పురస్కారం, శివాజీ రవికి సేవా కళారత్న పురస్కారం, హెచ్‌.ఎన్‌. నందిని సురేష్‌ కి నాట్య కళైవాణి పురస్కారాలతో సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement