మహాకవికి.. నీరాజనం
సాక్షి, చైన్నె: తమిళ మహాకవి తిరువళ్లువర్ దినోత్సవాన్ని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. కన్యాకుమారి తీరంలోని ఎత్తయిన విగ్రహం వద్ద ప్రత్యేక నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. వళ్లువర్ కోట్టం వేదికగా తిరువళ్లువర్ దినోత్సవ వేడుకలలో భాగంగా తమిళ సేవకులకు అవార్డులను సీఎంస్టాలిన్ ప్రధానం చేశారు. వివరాలు.. తమిళ అభివృద్ధి శాఖ, తమిళ భాష విభాగం నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వ అవార్డుల వేడుక, తమిళ పండితులు సాహితీ వేత్తలు, తమిళ సమాజ అభ్యున్నతికి పాటు పడుతున్న వారిని సత్కరించే కార్యక్రమం తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. శుక్రవారం తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా కామరాజర్ సాలైలలోని ఆయన విగ్రహానికి మంత్రులు స్వామినాథన్, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ తదితరులు పుష్పాంజలి ఘటించారు. రాజ్ భవన్‌లో తిరువళ్లువర్ విగ్రహానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి పూలలమాలలు వేశారు.
అవార్డులతో సత్కారం..
నుంగంబాక్కంలోని వళ్లువర్ కోట్టం వేదికగా తిరువళ్లువర్ దినోత్సవం ఘనంగా జరిగింది. సీఎం స్టాలిన్ ఈవేడుకకు హాజరయ్యారు. ఇక్కడున్న బ్రహ్మాండ తిరువళ్లువర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఇక్కడి ఆడిటోరియంలో అవార్డుల ప్రదోనత్సవం జరిగింది. తమిళ సేవకులు, తమిళ పండితులకు అవార్డులను సీఎం స్టాలిన్ అందుచేశారు. ఇందులో 2025 సంవత్సరానికి గాను డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురై మురుగన్‌కు అన్నా అవార్డును, సత్యవేల్ మురుగనార్‌కు తిరువళ్లువర్ అవార్డును, పెరియార్ అవార్డు అరుల్ మొళికి, సిందనై సెల్వన్‌కు అంబేడ్కర్ అవార్డును, ఇదయ తుల్లాకు కర్మయోగి కామరాజర్ అవార్డును, మహాకవి భారతియార్ అవార్డును నెల్‌లై జయంతకు, పావేందర్ భారతీ దాసన్ అవార్డును యుగ భారతికి, తమిళ్ తెండ్రల్ తిరు వికా అవార్డును ఇరై అన్భుకు అందజేశారు. కె విశ్వనాథన్ అవార్డును చెల్లప్పకు, కలైంజ్ఞర్ కరుణానిధి అవార్డును విడుదలై విరుంబికి ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకురూ.5 లక్షల నగదు, బంగారు, ప్రశంసాపత్రంతో సత్కరించారు. అలాగే 2025 సంవత్సరానికి సాహిత్య మామణి అవార్డు టి. రామలింగం, నరేంద్రకుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి ఎం.పి. సామినాథన్, హిందూ మత ధార్మిక శాఖ మంత్రి పి.కె. శేఖర్‌బాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శివ.వి. మీయనాథన్, ఆది ద్రావిడర్ సంక్షేమ మంత్రి ఎం మది వేందన్ పాల్గొన్నారు.
తిరువళ్లువర్ విగ్రహానికి
మంత్రుల నివాళి
సీఎం స్టాలిన్ నాలుగు వాగ్దానాలు
తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా సీఎం స్టాలిన్ నాలుగు వాగ్దానాలను తన ఎక్స్ పేజీ వేదికగా విడుదల చేశారు. సామాజిక అన్యాయం, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం, పేదలు, అవసరంలో ఉన్నవారికి మానవతా దృక్పథంతో కూడిన పథకాలు, యువ సమాజం మేధస్సును అభివృద్ధి చేయడానికి చొరవ, పారిశ్రామిక అభివృద్ధి, మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ తమ ప్రయాణం సాగుతుందని ప్రకటించారు.
మహాకవికి.. నీరాజనం
మహాకవికి.. నీరాజనం
మహాకవికి.. నీరాజనం


