10 మందితో విజయ్‌ ప్రచార కమిటీ | - | Sakshi
Sakshi News home page

10 మందితో విజయ్‌ ప్రచార కమిటీ

Jan 17 2026 8:26 AM | Updated on Jan 17 2026 8:26 AM

10 మందితో విజయ్‌ ప్రచార కమిటీ

10 మందితో విజయ్‌ ప్రచార కమిటీ

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ తన పార్టీ తరపున 10 మంది నేతలతో ఎన్నికల ప్రచార కమిటీని నియమించారు. తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు విజయ్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రయాణంలో ఆయనకు ఎదురవుతున్న ఒడి దొడుగులు ఎక్కువే. మీట్‌ దిపీపుల్‌ అంటూ ప్రజలలోకి వెళ్తున్న సమయంలో కరూర్‌ విషాద ఘటన ఆయనకు బ్రేక్‌ వేసింది. ఆ తదుపరి ఈ ప్రయణం అన్నది ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితులో ఎన్నికల ప్రచార వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు ముందు జాగ్రత్తగా కమిటీని రంగంలోకి దించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌, డిప్యూటీ ప్రచార కార్యదర్శి ఆదవ్‌ అర్జునన్‌, వర్కింగ్‌ కమిటీ కన్వీనర్‌ సెంగొట్టయ్యన్‌తో పాటూ పార్తీబన్‌, రాజ్‌కుమార్‌, విజయ్‌ దాము, ఎస్‌పీ సెల్వం, కె పిచాయ్‌ రత్నం, తదితరులతో 10 మందిని నియమించారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలలలో ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు వంటి అన్ని వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షణలో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement